నిధుల వినియోగంలో చంద్రబాబు ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల వినియోగం విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు. సోమవారం సచివాలయం వేదికగా మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవటంపై కార్యదర్శులపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు నిధులను ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే వెంటపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా అందే నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. జనవరి నెలాఖరులోపు అన్ని నిధులను పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో చంద్రబాబు నాయుడు సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను సరిగా ఉపయోగించకపోవటంపై సీరియస్ అయినట్లు తెలిసింది. జనవరి 15లోపు వాడుకోవాలని గడువు ఇచ్చినా కూడా ఎందుకు ఖర్చు చేయలేదని చంద్రబాబు మండిపడ్డారు. సమీక్ష సందర్భంగా సామాజిక, గిరిజన సంక్షేమ శాఖలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలలో నిధులు ఎక్కువగా మిగిలాయని చంద్రబాబు కోప్పడినట్లు తెలిసింది.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 320 కోట్ల రూపాయలకు గానూ.. 120 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని.. మిగతా నిధులను ఈ నెల చివరిలోపు ఖర్చుచేయాలని స్పష్టం చేశారు. లేకపోతే వెంటపడతామంటూ కార్యదర్శులను చంద్రబాబు హెచ్చరించారు. ఫిబ్రవరి తొలి, రెండు వారాలలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి.. మార్చి 15 నాటికి పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక సమీక్షా సమావేశం సందర్భంగా ఫైనాన్స్ శాఖను చంద్రబాబు అభినందించారు. మిగతా శాఖలతో పోలిస్తే.. ఫైనాన్స్ శాఖ బాగా పనిచేస్తోందని అన్నారు. జనవరి నెలాఖరులోపు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని.. మార్చి నాటికి కార్యదర్శులు అందరూ ఢిల్లీకి వెళ్లి డబ్బులు తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు పూర్తిస్థాయిలో నిధులు ఉపయోగించుకుని.. అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో కేంద్రం బడ్డెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈలోపు కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తిగా ఉపయోగించుకోవాలని.. కొత్త బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు కోరాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *