కొత్త జీవితానికి భరోసా

*దివ్యాంగుల వివాహాలకు రూ.2 లక్షల సాయం *సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని ప్రజాప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాం చెప్పినట్టుగానే దివ్యాంగుల జంట వివాహం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహం లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవసరమైన రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా దివ్యాంగులు దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే వారికి ఆర్థికంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.దివ్యాంగులు కుటుంబానికి భారమవుతున్నామని ఆత్మన్యూనతతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించాలి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దివ్యాంగుల కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే Pranaam వయోవృద్ధుల కోసం డే-కేర్ సెంటర్లను విర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించి అవసరమైన ఉపకరణాలను అందించి దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన రాకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాం అని స్పష్టం చేశారు. ప్యారా ఒలింపిక్స్‌లో రాణించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం. దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాన్స్‌జెండర్‌ను నామినేట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *