డమరుకం చేతబట్టి శౌర్య యాత్రలో మోదీ

★ 108 గుర్రాలతో మహా ఊరేగింపు

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం రోజున గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఆదివారం రోజున గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే ముందుగా సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరు స్మరిస్తూ ఏర్పాటు చేసిన 'శౌర్య యాత్ర' ఉత్సవ ఊరేగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో కూడిన ఊరేగింపు జరిగింది. శౌర్య యాత్రలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ ముందుకు సాగారు. దారికి ఇరువైపులా ఉన్న భక్తకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. అలాగే, ఊరేగింపు సమయంలో ప్రధాని మోదీ రెండు చేతులతో ‘‘డమరుకం’’ పట్టుకుని వాయించారు. 'డమరుకం' శబ్దం గాలిలో మారుమోగుతుండగా. ఆయనను చూడటానికి దారి వెంబడి నిలబడిన భారీ జనసమూహం హర్షధ్వానాలు చేసింది. ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు. ‘‘మోదీ-మోదీ’’ అని నినాదాలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ప్రధాని మోదీ, ఒక కిలోమీటరు పొడవునా సాగిన యాత్రలో ప్రజలకు అభివాదం చేశారు. అంతేకాకుండా సోమనాథ్ శౌర్యయాత్రలో భాగంగా మోదీ అక్కడి భక్తులతో కలిసి సాంప్రదాయ డ్రమ్ములను వాయించారు. 1026లో మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై మొదటిసారిగా భారీ దాడి చేశాడు. శతాబ్దాల కాలంలో సోమనాథ్ ఆలయంపై అనేకసార్లు విదేశీ దాడులు జరిగాయి. ఆ దాడుల సమయంలో ఆలయాన్ని, జ్యోతిర్లింగాన్ని కాపాడటానికి వేలాది మంది యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. సోమనాథ్‌ ఆలయంపై తొలి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయింది.ఈ క్రమంలోనే సోమనాథ్ ఆలయాన్ని రక్షించేక్రమంలో తమ ప్రాణాలు అర్పించిన యోధులకు గుర్తుగా ఈ శౌర్యయాత్ర నిర్వహించారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు ఆ తర్వాత ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ మందిరంలో ప్రార్థనలు చేసి, పూజలు నిర్వహించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర ఋషులకు, సాధువులకు, భక్తులకు అభివాదం చేశారు. అంతేకాకుండా, సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసి, పూజలు నిర్వహించిన తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'బాల గురువులు' పఠించే మంత్రాలను విన్నారు.