నిరుద్యోగ యువతకు బిగ్ రిలీఫ్

★ జాబ్ నోటిఫికేషన్లపై సర్కార్ కీలక నిర్ణయం.

జనం న్యూస్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఏటా ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు, ఫలితాల తేదీలతో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలను సైతం కల్పిస్తుంది. రెండేళ్లలో 70వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.తాజాగా మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు గుడ్‌న్యూస్ తెలిపారు. నిరుద్యోగులకు పండగలాంటి తీపికబురు చెప్పారు.త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉగాదికల్లా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబ్‌క్యాలెండర్ల ద్వారా ఎప్పుడు, ఏ నోటిఫికేషన్ విడుదల కానుందో తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం నిరుద్యోగులు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకునేందుకు వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే పలు ఉద్యోగాలను సైతం కల్పించిన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్, గ్రూప్స్‌, రెవెన్యూ శాఖలలో మెుత్తం 70వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు గ్రూప్స్‌తో సహా పలు నోటిఫికేషన్ల ద్వారా సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. మరోవైపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను విస్మరించి నేడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు, న్యాయపరమైన చిక్కులు వంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే టీజీపీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.ఈ నియామక ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు కనిపించినా..అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిరంతరంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ. రాబోయే రోజుల్లో ప్రతి ఏటా ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది. పరీక్ష తేదీలు ఎప్పుడూ, ఫలితాల తేదీలతో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.జాబ్ నోటిపికేషన్లపై సోష‌ల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. కేవలం ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని యువతకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి భర్తీ చేసే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్ప‌ష్టం చేశారు.