రోడ్డు ప్రమాదంలో మాజీ హోం మంత్రి కుమార్తె మృతి

జనం న్యూస్: పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుల్లో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి బాలా బచ్చన్ కుమార్తె ప్రేరణ బచ్చన్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చ్చన్ కుమార్తె ప్రేరణ బచ్చన్ మరో ముగ్గురితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా తేజాజీ నగర్ బైపాస్‌లోని రలమండల్ ప్రాంతం సమీపంలో వారి కారు ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేరణ, మరో ఇద్దరు యువకులు మృతిచెందగా. ఒక యువతి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. గాయపడిన యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రేరణ కాకుండా మృతుల్లో మిగిలిన ఇద్దరిని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ కస్లివాల్ కుమారుడు ప్రకార్ కస్లివాల్, ట్రాన్స్‌పోర్టర్ అయిన మన్‌సింధుగా గుర్తించారు. గాయపడిన యువతిని అనుష్క రాఠీ గుర్తించారు. ప్రకార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ప్రేరణ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేరణ బచ్చన్ కుమార్తె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను హృదయ విదారకం అని పేర్కొన్నారు. ఇక, ప్రతిపక్ష నాయకుడు ఉమంగ్ సింఘార్ ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *