
జనం న్యూస్: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మాజీమంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం అని మండిపడ్డారు. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే...ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అని మాజీమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో...విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది అని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు.అన్ని విభాగాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం అయ్యింది అని ధ్వజమెత్తారు.ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటనపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. వరుస పరీక్షా పత్రాల లీక్‌లు విద్యార్థుల భవిష్యత్తును బలి చేస్తున్నాయి అని మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెుద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోంది అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది అని మాజీమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని నిలదీశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉంది? అని మాజీమంత్రి హరీశ్ రావు నిలదీశారు. కాదేదీ స్కాంకు అనర్హం అన్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరం అని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంత్ రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనం అని మండిపడ్డారు. మహాకవి శ్రీశ్రీ ‘కాదేదీ కవితకు అనర్హం’అని చెప్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ‘కాదేదీ స్కాంకు అనర్హం’అని చెప్పడమే కాకుండా. చేసి చూపిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు. ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.