ప్రపంచ AI రంగంలో భారత్‌ నాయకత్వం వహించాలి: ప్రధాని మోదీ సూచనలు

పయనించే సూర్యుడు న్యూస్ : వచ్చే నెలలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు ఇండియన్‌ ఏఐ స్టార్టప్స్‌ (AI start-ups)తో జరిగిన రౌండ్‌టేబుల్ డిస్కషన్‌కి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఇండియన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) మోడల్స్‌ ఎథికల్‌గా, అన్‌బయాస్డ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు మన దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి ముందు గురువారం ఇండియన్‌ ఏఐ స్టార్టప్స్‌ (AI start-ups)తో జరిగిన రౌండ్‌టేబుల్ డిస్కషన్‌కి అధ్యక్షత వహిస్తూ ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) మోడల్స్‌ ఎథికల్‌గా, అన్‌బయాస్డ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇండియా తన AI ఎకోసిస్టమ్‌ని విస్తరిస్తున్నందున డేటా ప్రైవసీని ప్రొటెక్ట్‌ చేయాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేశారు. AI స్టార్టప్స్‌తో రౌండ్‌టేబుల్ అధికారిక ప్రకటన ప్రకారం, AI స్టార్టప్స్‌తో రౌండ్‌టేబుల్లో ఇండియన్‌ AI మోడల్స్‌ విభిన్నంగా ఉండాలని మోదీ చెప్పారు. స్వదేశీ కంటెంట్, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక అవసరాలను తీర్చాలని అన్నారు. స్టార్టప్‌లు, AI ఎంట్రప్రెన్యూర్స్‌ని ఇండియా ప్యూచర్‌కి కో-ఆర్కిటెక్ట్స్‌గా అభివర్ణించారు. దేశంలోనే పరిష్కారాలను నిర్మించేటప్పుడు గ్లోబల్ లీడర్‌షిప్‌ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రోత్సహించారు. ఆఫర్టబుల్‌ ఏఐపై ఫోకస్‌ ఆఫర్టబుల్‌, ఇన్‌క్లూజివ్‌ AIతో ప్రపంచాన్ని నడిపించే సామర్థ్యం భారతదేశానికి ఉందని మోదీ అన్నారు. ఇండియన్‌ కంపెనీలు అందరికీ అందుబాటులో ఉండే, ఉపయోగకరమైన AI సొల్యూషన్స్‌ డెవలప్‌ చేయాలని, టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్‌గా ఉండటమే కాకుండా, రియల్‌ వరల్డ్ ప్రాబ్లమ్స్‌కి ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ కావాలని పేర్కొన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’ స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక యూనిక్‌ AI మోడల్‌ ఇండియా నుంచి ప్రపంచానికి అందించాలని సూచించారు. AIలో ఇండియా రోల్‌  సొసైటీని మార్చడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. AIని ఉపయోగించుకోవడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలు, ఆయా రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తాయని చెప్పారు. గ్లోబల్‌ టెక్నాలజీలో దేశం ప్రధాన పాత్ర పోషించడంలో సహాయపడతాయని అన్నారు. ఇండియాకి ఇన్నోవేషన్‌లో స్ట్రాంగ్‌ కెపాసిటీ మాత్రమే కాకుండా లార్జ్‌ స్కేల్‌లో ఇంప్లిమెంట్‌ చేసే సత్తా కూడా ఉందన్నారు. ఇది AI సొల్యూషన్స్‌ని డెప్లాయ్‌ చేయడంలో యూనిక్ అడ్వాంటేజ్ ఇస్తుందని తెలిపారు. గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లో స్టార్టప్స్‌ ‘AI ఫర్ ఆల్: గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్’కు అర్హత సాధించిన పన్నెండు ఇండియన్‌ AI స్టార్టప్స్‌ రౌండ్‌టేబుల్‌కు హాజరై తమ వర్క్‌ని ప్రెజెంట్‌ చేశాయి. ఈ స్టార్టప్స్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ ఫౌండేషన్ మోడల్స్‌, మల్టిలింగ్యువల్ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ స్పీచ్-టూ-టెక్స్ట్, టెక్స్ట్-టూ-ఆడియో, టెక్స్ట్-టూ-వీడియో టెక్నాలజీ సహా చాలా ఏరియాస్‌లో వర్క్‌ చేస్తున్నాయి. ఈ-కామర్స్, మార్కెటింగ్‌లో 3D కంటెంట్ కోసం జనరేటివ్ AI, పర్సనలైజ్డ్‌ కంటెంట్ క్రియేషన్‌, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్‌, మెటీరియల్ రీసెర్చ్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ ఫర్‌ డెసిషన్‌ మేకింగ్‌పై ఫోకస్‌ చేస్తున్నాయి. అలానే AI-బేస్డ్‌ హెల్త్‌కేర్‌ డయాగ్నస్టిక్స్, మెడికల్‌ రీసెర్చ్‌కి కూడా ప్రాధాన్యం ఇచ్చాయి ఇండియా AI ఎకోసిస్టమ్‌పై విశ్వాసం బలమైన AI ఎకోసిస్టమ్‌ నిర్మించడంలో ఇండియా చూపుతున్న కమిట్‌మెంట్‌ని స్టార్టప్‌లు ప్రశంసించాయి. వారు ఈ సెక్టార్‌ ర్యాపిడ్‌ గ్రోత్‌ని హైలైట్‌ చేశారు. భారతదేశంలో AIకి గొప్ప ఫ్యూచర్‌ ఉందని పేర్కొన్నారు. AI ఇన్నోవేషన్‌, డెప్లాయ్‌మెంట్‌ క్రమంగా భారతదేశం వైపు మారుతోందని చెప్పారు. సపోర్టివ్‌ పాలసీ ఎన్విరాన్‌మెంట్‌, పెరుగుతున్న ట్యాలెంట్‌ బేస్‌ ఇందుకు కారణమని తెలిపారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచ AI మ్యాప్‌లో దృఢంగా ఉందని చెప్పారు. ఎవరు హాజరయ్యారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అవతార్, భారత్‌జెన్, ఫ్రాక్టల్, గాన్, జెన్లూప్, గ్నాని, ఇంటెల్లిహెల్త్, సర్వమ్, షోధ్ AI, సోకెట్ AI, టెక్ మహీంద్రా, జెంటీక్ వంటి ప్రముఖ AI కంపెనీల CEOలు, సీనియర్ రెప్రజెంటేటివ్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *