స్టూడెంట్స్‌కు అదిరిపోయే అప్‌డేట్

*ఉచిత ల్యాప్‌టాప్ పథకం ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ : విద్యార్థుల కోసం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచం మీ చేతుల్లో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అర్హులైన 20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయాలని నిర్ణయించింది. మెుత్తం 20 లక్షల ల్యాప్‌టాప్‌లను రెండు దశల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్లి నుంచి 10 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుకతోపాటు రూ.3000 అందిస్తోంది. ఇలాంటి సందర్భంలో అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదోతెలుసుకోవలని ఉందా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఉలగం ఉన్ కైగలిల్ స్కీం తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.‘ఉలగం ఉన్ కైగలిల్’(ప్రపంచం మీ చేతుల్లో) అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 20 లక్షల మంది విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లు అందజేయనుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొననున్నారు. రెండు దశల్లో 20 లక్షల ల్యాప్‌టాప్‌లు పంపిణీ అయితే ఈ 20 లక్షల ల్యాప్‌టాప్‌లను రెండు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం తొలివిడతలో భాగంగా 10 లక్షల ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మలివిడతగా మరో 10 లక్షల ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులను డిజిటల్‌గా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులు వీరే ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్, లా, అగ్రికల్చర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే ప్రభుత్వం అందిస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లు డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందినవి అని ప్రభుత్వం తెలిపింది. ఇంటెల్ i3 ప్రాసెసర్, 8 GB ర్యామ్, 256 GB ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 365 వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ల్యాప్‌టాప్‌లను ప్రభుత్వం అందజేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *