
జనం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సంచలన విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని అన్నారు. జనగామ జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డి ఏం తెల్వదని విమర్శించారు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి నీళ్ల గురించి పాఠాలు చెబుతున్నాడని అసలు గోదావరి ఎక్కడుందో రేవంత్‌కు తెలియదని అన్నారు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయిందని, ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ఎలా మోసం చేశారో ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎలా తయారైందో ఆలోచన చేయాలని, యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారని అన్నారు. గ్రామాల్ ప్రజలులో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఎదురించి, ప్రాణాలకు తెగించి కొట్లాడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని అలాంటి వ్యక్తిపై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నదులపై, తెలంగాణపై రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణలో అన్నివర్గాలకు సంక్షేమం అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌కు ఉరివేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశారని విమర్శించారు. మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు విని ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారని అన్నారు. చదువుకున్న విద్యార్థులను, నిరుద్యోగులను మోసకారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీని ఉరి తీయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని, ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ కింద హామీ ఇచ్చిన తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎందుకు అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నారని అన్నారు. తన చదువు మీద రేవంత్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే లంగా పనులు చేసుకుంటూ చదువుకోలేదని.. దానికి తానేం చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్... కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి సస్తాడు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దాం. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందాం. గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ కోసం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, ఒత్తిడులకు గురిచేసినా పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ధన్యవాదాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.