రైతుల ఖాతాల్లో నిధుల జమ ప్రారంభం…

★ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసింది. వారి బ్యాంకు ఖాతాల్లో హెక్టారుకు రూ.50,000 చొప్పున నిధులను జమ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసింది. వారి బ్యాంకు ఖాతాల్లో హెక్టారుకు రూ.50,000 చొప్పున నిధులను జమ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉల్లి సాగుతో నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీకి సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు అన్చెన్నాయుడు భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయం అని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని తెలిపారు. అకాల వర్షాలు ఉల్లి రైతులు పంట నష్టం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని... ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రూ.150 కోట్లు మంజూరు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి నీటి పారుదల, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమని అచ్చెన్నాయుడు తెలిపారు. 2014-2019 కాలం వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు స్వర్ణయుగంగా నిలిచిందని అన్నారు. ఆ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసమే రూ. 50 వేల కోట్ల ఖర్చు చేసి శరవేగంతో ముందుకు తీసుకెళ్లామన్నారు. వ్యవసాయ రంగంలో 7-8 ఉన్న జిడిపి 17 శాతం వరకు తీసుకొని వెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రెండు ముఖ్యమైన శాఖలును నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా ఇరిగేషన్ రంగంలో పనులు చేస్తామన్నారు. తొలుత మిరప పంటకు ధర పడిపోయిందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి, మార్కెట్‌ను స్థిరీకరించి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమది అని మంత్రి పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గో మీ గోదావరి జిల్లాల్లో కోకో పంట ధర పడిపోతే... కోకో రైతులను ఆదుకునేందుకు రూ.15 నుంచి రూ. 20 కోట్ల దాకా ఖర్చు చేశామన్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కోసం రూ. 12 వేల గిట్టుబాటు ధర కల్పించి, రూ.300 కోట్లు ఖర్చు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు 12 రూపాయల ధరను నిర్ణయించి అందులో 4 రూపాయలు ప్రభుత్వం భరించేలా, మిగిలి 8 రూపాయలు పరిశ్రమలు వారు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వం కేజీకి రూ. 4 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని చెప్పారు. ఉల్లి రైతుల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్వం అని ప్రకటించినప్పుడు హెక్టారుకు 17,500 రూపాయలు ఇస్తారని... అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి దానికి 7,500 రూపాయలు కలిని హెక్టారుకు మొత్తం రూ. 25,000 వేలు అందించారని అన్నారు. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో అనుకోని ప్రకృతి వైపరీత్వం వల్ల రైతులు పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయారని అన్నారు. దీంతో కిలో ఉల్లిపాయలను రూ. 12 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించామని అన్నారు. అప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో సరైన ప్రణాళిక లేకపోతే రైతులు భారీగా నష్టపోతారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా... ప్రభుత్వానికి రైతులే ప్రాధాన్యం అని ఆయన చెప్పారని తెలిపారు.