నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల

★ అమరవీరుల స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నా ★ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.రాజకీయ జీవితంలో తనకు పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు. ‘పోటీ చేసిన సంఖ్యలో 50 శాతం విజయం సాధించడం అభినందనీయం. జనసేన పార్టీ మద్దతుదారులుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలి’అని జసేననాని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన అభ్యర్ధులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్ధికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించారు. మీరు మొదలుపెట్టిన ప్రయాణం కీలకమైనది. నేను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల. నాకు తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే చాలా ఇష్టం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.‘నేను ఇక్కడి నుంచి ఏమీ ఆశించడం లేదు. మన దేశం, మన తెలుగు నేలకు జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవ కలసికట్టుగా చేద్దాం. తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడ ప్రజలకు అండగా నిలుద్దాం’అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేద్దాం తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉంది. మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయండి. మీరంతా సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన వారిని విభేదించడం కష్టం. అది నేను ప్రాక్టికల్ గా చేసి చూపాను’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ నేల నాకు పోరాట శక్తి ఇచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నాను అంటే తెలంగాణ అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణం. రజాకార్ల మీద వారు చేసిన సుదీర్ఘ పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.‘సమయం ఇవ్వగలిగితే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చు’. 53 మంది విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది. మీ అందరికీ ఆ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలి. పాలసీ ప్రకారమే పోరాటం అంజన్న సన్నిధి తనను కాపాడింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కష్టకాలాల్లో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని కొనియాడారు.