జనం న్యూస్: కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్, బి.ఆర్. నాయుడు, టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా కొలుస్తామని అన్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఒక పార్టీకి కాకుండాతెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. స్వామివారి సేవలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి.చైర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలసి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్‌ని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో టి. శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు. పవన్ కళ్యాణ్‌తోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్ కె సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. స్వామివారికి సేవ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆంజనేయ స్వామి ఒక ప్రాంత సొత్తు కాదు. ఒకరి సొత్తు కాదని విశ్వంతర్యామి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి స్వామి వారికి తాము సేవ చేసుకోవడం ఆనందంగా ఉంది అని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన రూ.35.19 కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండపం కోసం భూమి పూజ నిర్వహించారు. 96 గదులతో ధర్మశాలను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు కృషి చేస్తాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తోంది. సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా గిరి ప్రదక్షణ ఏర్పాట్లకు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిప్యూటీ సీఎంను కోరారు. అయితే అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.భూమి పూజలో పాల్గొన్న తర్వాత నాచుపల్లి శివారులోని రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశానికి బయలుదేరి వెళ్లారు.అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.