
జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అని స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ఒంటరిగా ఉంటున్నారని. పోలీసు భద్రతల నడుమ ఉంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధినేతగా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా, శాసన సభ్యుడిగా ఇప్పటి వరకు కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే శాసన సభ్యుడిగా మాత్రం జీతభత్యాలు తీసుకుంటూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. 1 డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు రూ.57 లక్షల 84వేల 124 రూపాయలు జీతం రూపంలో కేసీఆర్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి రారు కానీ జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్లు బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది తాను అన్నది కాదని సుప్రీంకోర్టు స్వయంగా తీర్పులో వెల్లడించింది అని గుర్తు చేశారు.ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుని తెలంగాణ ప్రజలను గాలికొదిలేశారు అని మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని, రాష్ట్రాన్ని ఖర్మకు వదిలేసిన వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కనీసం క్రమశిక్షణ, అవగాహన లేకుండా ఎమ్మెల్యేలను తయారు చేశారని మండిపడ్డారు. రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్లు బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది అని ధ్వజమెత్తారు. ఈ జీతం సంగతి అటు ఉంచితే సెక్యూరిటీ సంగతి మరో కథ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ సెక్యూరిటీల జీతం వేరేగా ఉంది అని దాని గురించి తాను చర్చించ దలచుకోలేదు అని చెప్పుకొచ్చారు.