రాత్రిపూట ప్రయాణానికీ కొత్త అనుభవం

★వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది! ★180 కి.మీ వేగంతో వందే భారత్ స్లీపర్ పరుగులు

సాక్షి డిజిటల్ న్యూస్ : 2026 జనవరిలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే వందే భారత్ స్లీపర్ రైలులో టికెట్ ఛార్జీలు ఏ విధంగా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశ సెమీ హై స్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రస్తుం దేశంలో వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్‌ను కూడా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకోస్తుంది. ఈ వందేభారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. అయితే దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ నెలలో వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. 2026 జనవరిలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తిగా ఏసీ సౌకర్యం గల ఈ స్లీపర్ రైలు రాత్రిపూట ప్రయాణాలకు, సుదూర మార్గాలకు ప్రయాణించేవారి కోసం తయారు చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 1,200–1,500 కిలోమీటర్ల మార్గాలలో సేవలు అందించే లక్ష్యంతో రూపొందించారు. రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, విజయవంతంగా ట్రయల్ రన్‌ల కూడా పూర్తి అయిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో మరో ఎనిమిది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడతామని... ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను మొత్తంగా 12కు తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతి - కోల్‌కతా మధ్య పరుగులు తీయనుందని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉండగా.. మొత్తం 823 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదు. 16 కోచ్‌లలో 11 ఏసీ 3-టైర్ కోచ్‌లు, నాలుగు ఏసీ 2-టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్-క్లాస్ కోచ్ ఉంటాయి.