
జనం న్యూస్: జనవరి 8న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కే విజయానంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి 6వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు సమర్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంకు ముహూర్తం ఖరారు అయ్యింది. కొత్త సంవత్సరంలో జనవరి 8న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి 6వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారయంత్రాంగానికి సూచించారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో. శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ప్రాజెక్టుల అనుమతులు, కీలక పదవుల నియామకాలు వంటి పలు కీలకమైన అంశాలపైసమావేశంలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది అని తెలుస్తోంది.