సాక్షి డిజిటల్ న్యూస్ : డెహ్రాడూన్‌లో ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా దారుణ హత్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జాతివివక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరంగా అభిప్రాయపడ్డారు.ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటుగా స్పందించారు. జాతివివక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరంగా అభిప్రాయపడ్డారు.ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని వ్యాఖ్యానించారు. జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏంజెల్ చక్మా దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయో అనడానికి ఈ దారుణ హత్యనే ఒక ఉదాహరణ అని అన్నారు. ఇటువంటి నేరాలు కేవలం విడిగా జరిగిన సంఘటనలు కావని ద్వేషాన్ని, వివక్షను సహించడం వల్ల కలిగే ముప్పుకు ఇవి ఒక హెచ్చరిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశం ఇటువంటి విషాన్ని భరించలేదు ‘భారతదేశం జాతి వివక్ష, ద్వేషం వంటి విషాన్ని భరించలేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.‘భిన్నత్వంలో ఏకత్వం అనే పునాదిపై నిర్మించబడిన మన దేశం, ఇలాంటి విద్వేషాలను భరిస్తూ మనుగడ సాగించలేదు. న్యాయం అందించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదు. జాతివివక్ష అది ప్రత్యక్షంగా ఉన్నా లేదా పరోక్షంగా ఉన్నా…దానిపై‘జెరో టాలరెన్స్ ( కఠిన వైఖరి)’ని ప్రదర్శించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నైతిక మరియు రాజ్యాంగపరమైన బాధ్యత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బాధ్యత అనేది పక్షపాతంగా ఉండకూడదు జాతి వివక్షతో కూడిన మాటలు, ప్రవర్తించిన తీరు మరియు రెచ్చగొట్టే చర్యలను తీవ్ర నేరంగా పరిగణించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ చర్యలపై కఠిన శిక్షలు అమలు చేసేలా స్పష్టమైన చట్టాలను తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.జాతి వివక్ష, ద్వేషంతో కూడిన దాడులు జరిగినప్పుడు తక్షణమే అరెస్ట్ చేయడం, విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టంలో నిబంధనలు రూపొందించాలని ఆయన కోరారు.‘చట్టం తన పని తాను చేయాలి. బాధ్యత అనేది పక్షపాతంగా ఉండకూడదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నొక్కి చెప్పారు. నేరాలు పునరావృతం కాకుండా చూడాలి భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం మరియు గౌరవం కల్పించింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. జాతి వివక్ష నుండి పౌరులను రక్షించడం అంటే కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని…అది దేశం యొక్క మానవ హక్కుల నిబద్ధతకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.‘వివక్షను పెంచి పోషిస్తే అది వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా.. ఇలాంటి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన రక్షణలు, పకడ్బందీ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా దారుణ హత్య డెహ్రాడూన్‌లో డిసెంబర్ 9న తమ్ముడు మైఖేల్‌తో కలిసి ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా(24) షాపింగ్ చేస్తున్నాడు.అయితే స్థానిక యువకులు‘చైనీస్’,‘చింకీ’,‘మోమో’అనే జాతి వివక్షతో కూడిన పదాలతో వారిని అవమానించారు.దీంతో ఏంజెల్ చక్మా ఆయన సోదరుడు మైఖేల్ అభ్యంతరం తెలియజేశారు.దీంతో ఆరుగురు దుండగులు కత్తి, గాజు బ్రేస్‌లెట్‌తో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఏంజెల్ చక్మాను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 17 రోజులు పోరాడి డిసెంబర్ 26న ప్రాణాలు వదిలాడు. ఇకపోతే ఏంజెల్ చక్మా, మైఖేల్‌ది త్రిపురగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు యాగ్య అవస్తి నేపాల్‌కు పారిపోయాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్యపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. ఈ హత్యలో జాతి ద్వేషం కోణం లేదని తెలియజేశారు.మరోవైపు ఈ దాడి నేపథ్యంలో బాధితుడి కుటుంబం, ఈశాన్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.దాడిని నిరసిస్తూ త్రిపురలో నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు ప్రముఖులు హేట్ క్రైమ్‌గా ఖండించారు. ఈ ఘటనపై NHRC నోటీసులు జారీ చేసింది.