పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులను బాధ్యత స్పెషల్ సీఎస్ సమన్వయం చేసుకుంటారని తెలిపారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలని, ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలని జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని పరిపాలనను పట్టాలెక్కించాలనేదే తమ ఆలోచన అని సీఎం తెలిపారు. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్ లో ఉండాల్సిందే చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ బస్సులు, ఆటోలను, చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడా, రోడ్లపై గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ప్రతీ నెలకు ఒకసారి స్వయంగా సమీక్ష కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించుకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలన్నారు. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు కార్యాలయాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్దరించి యాక్టివిటీ జోన్స్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. జనవరి నుంచి ప్రతీ ఒక్కరూ ఫీల్డ్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నగరం భవిష్యత్ మారుతుందన్నారు. ప్రతీ నెలకు ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.