
పయనించే సూర్యుడు న్యూస్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. రద్దీ అధికంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ముఖ్యమైన ఫోన్ నంబర్లను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. రద్దీ అధికంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ముఖ్యమైన ఫోన్ నంబర్లను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాన సహాయ కేంద్రాలు (24 గంటల సేవలు) TTD హెల్ప్‌లైన్ (టోల్ ఫ్రీ): 155257 విచారణ కార్యాలయం (Enquiry): 0877-2277777 వైద్య సహాయం తిరుమలలో అస్వస్థతకు గురైన భక్తులు వెంటనే కింది నంబర్లను సంప్రదించాలని సూచించారు. అశ్విని ఆసుపత్రి (తిరుమల): 0877-2263457 / 2263458 అంబులెన్స్ సేవలు: 0877-2263666 (లేదా నేరుగా 108) మెయిన్ హాస్పిటల్ (తిరుపతి): 0877-2287777 భద్రత & పోలీస్ సేవలు దొంగతనాలు, తప్పిపోయిన వారు లేదా ఇతర భద్రతా సమస్యల కోసం కింది నంబర్లను సంప్రదించవచ్చు. విజిలెన్స్ ఆఫీస్ (TTD Security): 0877-2263333 తిరుమల క్రైమ్ పార్టీ: 0877-2263939 తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 0877-2263833 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: 0877-2263733 ఇతర ముఖ్యమైన సేవలు కళ్యాణకట్ట (తలనీలాలు): 0877-2263222 అన్నప్రసాదం సెంటర్: 0877-2263555 ముఖ్య సూచనలు : కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పిపోయినట్లయితే వెంటనే సమీపంలోని విజిలెన్స్ ఆఫీస్‌ను సంప్రదించి అనౌన్స్మెంట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. తిరుమలలో చాలా చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, నెట్వర్క్ సమస్యలు లేదా సర్వర్ అంతరాయాల దృష్ట్యా కొంత నగదు చేతిలో ఉంచుకోవడం మంచిదని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో గత అర్దరాత్రి దాటిన తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. శ్రీవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు, సామాన్య భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు రథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయ మాడ వీధుల మీదుగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ సుందర దృశ్యాలను చూసి శ్రీవారి భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో తిరుమల గిరులు గోవిందా నామస్మరణతో మారుమోగాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు శుభ ముహూర్తంలో అర్ధరాత్రి దాటాక ప్రారంభమయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేశారని చెప్పారు. అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామని.. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి, తదితరులు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు, నటుడు శివాజీ, నటుడు నారా రోహిత్ దంపతులు, నిర్మాత డీవీవీ దానయ్య, హీరోయిన్ శ్రీలీల, నిర్మాత బండ్ల గణేష్, క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, తదిరుతుల కూడా శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇక, తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది.