
జనం న్యూస్: ‘విద్యార్థులు నుండి ఫీజులు వసూలు చేసుకునేందుకు మాత్రం ప్రైవేటుకు అవకాశం కల్పించడం విచారకరం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పిపిపి విధానం ప్రభుత్వ ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టడమే. టెండర్లు వేసేందుకు కూడా ఎవరూ రాని పరిస్థితుల్లో, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాత్రం టెండర్లు వేసేందుకు ముందుకు వస్తున్నారని అవాస్తవాలు చెబుతున్నారు’అని సీపీఐ జాతీయకార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి)పేరుతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని పిపిపి విధానానికి స్వస్తి పలికి నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు కే రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.‘రాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం చూపిస్తూ, మొండిగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో రాష్ట్ర ప్రభుత్వ పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. పీపీపీ విధానం అంటే ప్రభుత్వ ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడమే. ‘మెడికల్ కాలేజీలో పీపీపీ విధానం వల్ల రోగులు ఇబ్బందులు పడటమే కాకుండా సామాన్య,మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోతారని మాజీ యూనియన్ హెల్త్ సెక్రటరీ సుజాత రావు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ స్పష్టం చేశారు.‘నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం భూములు, భవనాల నిర్మాణం, వనరులు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పించింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడంతోపాటు, రెండేళ్ల పాటు సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవటం దుర్మార్గం. విద్యార్థులు నుండి ఫీజులు వసూలు చేసుకునేందుకు మాత్రం ప్రైవేటుకు అవకాశం కల్పించడం విచారకరం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పిపిపి విధానం ప్రభుత్వ ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టడమే. టెండర్లు వేసేందుకు కూడా ఎవరూ రాని పరిస్థితుల్లో, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాత్రం టెండర్లు వేసేందుకు ముందుకు వస్తున్నారని అవాస్తవాలు చెబుతున్నారు’అని సీపీఐ జాతీయకార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. పిపిపి విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పేద మధ్యతరగతి వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే విద్యని ఆయుధంగా చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వందలాది మందికి విద్యను అందించటం అభినందనీయమే. కానీ ప్రభుత్వ రంగంలోని వాటిని ప్రైవేటుకు అప్పగించి. ట్రస్టు ద్వారా మాత్రం కొందరికి చదువులు చెప్పించి మిగిలిన వారిని గాలికి వదిలేయటం సబబేనా? రాష్ట్రంలోని విద్యా వైద్య రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తే పేద సామాన్య మధ్య తరగతి వర్గాలకు అవి అందుబాటులో ఎలా ఉంటాయి? అని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే ఏపీలో ప్రాథమిక, ఉన్నత విద్య, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు ప్రైవేటు శక్తుల చేతుల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పిపిపి విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.