తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు

* సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పరామర్శ.

జనం న్యూస్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలోకి ప్రవేశించి. అప్పటికే సభలో కూర్చుని ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి పలకరించారు. ఇక, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఆయనను పలకరించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. శాసన సభ ప్రారంభం కాగానే. జాతీయ గీతం ప్లే చేశారు. అనంతరం ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. అయితే శాసనసభ సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే. కేసీఆర్ సభలో నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఇక, అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ శాసనసభ రిజిస్టర్‌లో సంతకం చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో జీరో అవర్ కొనసాగుతుంది. ఇక, గత కొంతకాలంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మీడియా ముందుకు రావడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు తాము కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతున్నామని, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈరోజు శాసనసభకు వచ్చారు. ఇందుకోసం ఆదివారం రోజునే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈరోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అయితే శాసనసభలో కొద్దిసేపు మాత్రమే ఉన్న కేసీఆర్… ఆ తర్వాత బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సెషన్‌లో మిగిలిన రోజులు కేసీఆర్ శాసనసభకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *