ఏపీలో మరో 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

*28కి చేరనున్న జిల్లాల సంఖ్య

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రోజున సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించిన కూటమి ప్రభుత్వం… జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు సహా మండలాలు, గ్రామల సరిహద్దులు మార్పులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు చర్చలు జరిపింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక, సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా… మూడు కొత్త జిల్లాలు మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరంల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని… కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు. అంటే కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ… ఒక జిల్లాను తొలగించడంతో రాష్ట్రంలో జిల్లాల మొత్తం సంఖ్య 28కి పెరగనుంది. ఇందుకు సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముఖ్యమైన మార్పులు >> ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలో విలీనం చేస్తారు.>> అన్నమయ్య జిల్లాలో భాగమమైన రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేస్తారు. >> అన్నమయ్య జిల్లాలో భాగమైన రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో కలపున్నారు. >> గూడూరును తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలో కలపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *