
సాక్షి డిజిటల్ న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో సాహసానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు.మరోవైపు సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో పయనించారు. తాజాగా జలంతర్గామిలో విహరించేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సిద్ధమయ్యారు. ఈనెల 28న కర్ణాటకలోని కార్వాడ్ హార్బర్ నుంచి సముద్రప్రయాణం చేయనున్నారు. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము మరో అరుదైన ఘనత సాధించనున్నారు.ఇప్పటికే సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరో ఘనత సాధించనున్నారు. జలంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 28(ఆదివారం)న కర్ణాటకలోని కార్వాడ్ హార్బర్ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ద్రౌపది ముర్ము డిసెంబర్ 27 నుంచి నాలుగురోజులపాటు పలు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. గోవా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. జలంతర్గామిలో విహరించనున్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కార్వాడ్ నౌకాశ్రయం నుంచి ఆమె ప్రయాణం సాగుతుంది అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2నెలల క్రితం రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఔరా అనిపించారు. అంతకుముందు 2023 మే 8న అసోంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విహరించిన సంగతి తెలిసిందే. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2009లో యూపీఏ హయాంలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్ కూడా ఇదే ఫైటర్ జెట్లో గగన విహారం చేసి రికార్డు సృష్టించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం 2006లో పుణె ఎయిర్ఫోర్స్ స్థావరం సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.