తెలంగాణ రైతులకు రైతు భరోసా నిధులు

★సంక్రాంతి కానుకగా విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు భరోసా.ఈ స్కీంకింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా అందజేయాలని నిర్ణయించింది. అయితే ఈసారి పంట సాగు చేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించాలని భావిస్తోంది.యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇదే తరహాలోనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించేందుకు కసరత్తు చేస్తోంది. రైతుభరోసా పథకం కోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఏడాది మొత్తంలో ఎకరానికి రూ.12 వేలు అందజేయనుంది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా సంక్రాంతి కానుకగా యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జనవరిలో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదల అయిన వెంటనే ఆర్థిక శాఖచెల్లింపుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోపు రైతుభరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సాగు లెక్కల నమోదులో అధికార యంత్రాంగం రైతు భరోసా కొందరు అనర్హుల అకౌంట్లోకి కూడా వెళ్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. గత యాసంగి, వానాకాలం సాగు లెక్కలు, రైతుభరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతోపాటు... ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా చెల్లించాలి? ఇందుకు ఎన్ని కోట్లు అవసరం? అనేదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక జాబితా సిద్ధ చేస్తున్నట్లు తెలుస్తోంది