భారతీయ ఇతిహాసాల గొప్పతనంపై సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

జనం న్యూస్: స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి. హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్ప వారని. వారిని, చరిత్రను వివరించాలి. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ‘మన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోంది. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి.అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం ఎంతో వెనుకబడి ఉన్నాయి. 2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జీ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేది కానీ విదేశీ పాలన, మన పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడింది’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. విజ్ఞానాన్ని సముపార్జించిన దేశం భారతదేశం. ‘ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని కొనియాడారు. ‘మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అని చెప్పుకొచ్చారు. ‘ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పింది. 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం. ప్రధాని మోడీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించాం. ఇవాళ యోగాను 150 దేశాలు సాధన చేస్తున్నాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది. పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనది. 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది సున్నాను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. భారతదేశానిది అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. ‘1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నాం. ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారు. వివిధ దేశాలు ఏజింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విలువలు, నైతికత వంటి అంశాలను పెంపొందించేందుకు మోహన్ భగవత్ వంటి వారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘భారత దేశానిది అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుంది. భారత దేశం నెంబర్-1 స్థానానికి వెళ్లే సందర్భంలోనే పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించు కోవాల్సిన అవసరం ఉంది. గంగా-కావేరీ నదుల అనుసంధానం అనేది జరగాలి. అప్పుడు నీటి భద్రత కలుగుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.