మెడికల్ అన్‌ఫిట్ అయినా ఆశ ఉంది

*ఆర్టీసీ ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు

సాక్షి డిజిటల్ న్యూస్: మెడికల్‌గా అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్‌గా అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నుంచి ఈ చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులు అంతా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు పొందనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి ఏపియస్ ఆర్టీసిలో డీజల్ ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టాలను కుంటున్న విద్యుత్ బస్సులను ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ (ఇయు)గా స్వాగతిస్తున్నామని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు దామోదరరావు వెల్లడించారు.అయితే ఈబస్సులు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా కాకుండా ప్రభుత్వమే కొనుగోలుచేసి ఆర్టిసీ ద్వారా ఆర్టిసి సిబ్దందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఇయు) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం 26 జిల్లాల నుండి వచ్చిన ఇ.యు రాష్ట్ర నాయకులు నాలుగు జోన్ల,26 జిల్లాలు,నాలుగు నాన్ ఆఫరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగులు పలు అంశాలపై చర్చించారు. కొత్త విద్యుత్ బస్సుల కొనుగోలుపై చర్చించారు.ఈ సందర్భంగా దామోదరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ స్సులను ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నిర్వహించాలని లేకపోతే దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేటు పరం చేసేందుకు తీసుకుంటున్న కుట్రలుగా ఉద్యోగులు భావించే ప్రమాదం ఉన్నందున విద్యుత్ బస్సులు అన్ని ఆర్టీసి ద్వారా నిర్వహించాలని కోరారు.అన్ని విద్యుత్ బస్సులే కాకుండా కొన్ని డీజల్ బస్సు కూడా కొనుగోలు చేయాలని ఏపీపీటీడీ(ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో కేసులు రాస్తే ఉద్యమిస్తాం స్త్రీశక్తి పధకాన్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసి వీసీ అండ్ ఎడీతోపాటుఅధికారులు,సూపర్ వైజర్లు కండక్టర్లు,డ్రైవర్లు మెకానికల్ సిబ్బంది అందరం కలసి చాలిచాలని డొక్కు బస్సులుతోను,చాలి చాలని సిబ్బందితో ప్రతిరోజు సిబ్బందితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ స్త్రీశక్తి పథకాన్ని విజయవంతంగా నడుపుతున్నారని అన్నారు.అయితే ఓవర్ లోడు కాణంగా జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లను తణిఖీ అధికార్లు కేసులు రాస్తుంటే డిపోమేనేజర్లు క్షమించకుండా సస్పెండ్లు,రిమూల్సు చేయడం,తీవ్రమైన ఇంక్రీమెంట్లు పనిష్ మెంట్లు చేస్తున్న విధానాలు మానుకోకపోతే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని సోమవారం జరిగిన రాష్ట్ర కార్య వర్గసమావేశంలో నిర్ణయం జరిగిందిన పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *