ఎల్వీఎం3-ఎం6 విజయవంతం! ఇస్రో మరో చరిత్రాత్మక రికార్డు

* ఆకాశంలో భారత్ జెండా విజయవంతమైన ఎల్వీఎం3–ఎం6 ప్రయోగం

పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఈరోజు ఉదయం ఎల్వీఎం3 -ఎం6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఈరోజు ఉదయం ఎల్వీఎం3 -ఎం6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2ను నింగిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం వేరు చేయబడి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. ఈ రాాకెట్‌ను భారతదేశపు ‘బాహుబలి’ రాకెట్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మంగళవారం ప్రారంభం కాగా.. ఈరోజు ఉదయం ఎల్వీఎం3 -ఎం6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇక, ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ మాట్లాడుతూ… ఎల్వీఎం3 -ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందని పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెగసిన అతి పెద్ద ఉపగ్రహం ఇదేనని తెలిపారు. ‘‘ప్రయోగ వాహనం బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలో విజయవంతంగా, ఖచ్చితంగా ప్రవేశపెట్టింది. ఇది అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అనే కస్టమర్ కోసం చేపట్టిన మొదటి ప్రత్యేక వాణిజ్య ప్రయోగం… ఇది శ్రీహరికోట నుంచి మేము చేపట్టిన 104వ ప్రయోగం. అలాగే ఎల్వీఎం-3 ప్రయోగ వాహనం 9వ విజయవంతమైన మిషన్… ఇది దాని 100 శాతం విశ్వసనీయతను నిరూపించింది… కేవలం 52 రోజుల్లోనే ఎల్వీఎం-3 వాహనంతో చేపట్టిన వరుసగా రెండో మిషన్ ఇది… భారతీయ లాంచర్‌ను ఉపయోగించి భారత గడ్డ నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. ఇది ఎల్వీఎం-3 మూడో పూర్తి వాణిజ్య మిషన్ కూడా… ఈ రాకెట్ తన అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది అని వీ నారాయణన్ పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప విజయం అని అన్నారు. భారత ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా సాధించిన గొప్ప లక్ష్యం అని చెప్పారు. ప్రధాని మోదీ అభినందనలు ఎల్వీఎం3 -ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. భారత నేల నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇది అని చెప్పారు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 అంతరిక్ష నౌకను నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా ఎల్విఎం3-ఎం6 ప్రయోగం విజయవంతమైందని భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. ఇది భారతదేశ భారీ ప్రయోగ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్‌లో దేశానికి పెరుగుతున్న పాత్రను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ‘‘ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా మన ప్రయత్నాలకు కూడా ప్రతిబింబం. మన కష్టపడి పనిచేసే అంతరిక్ష శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు. అంతరిక్ష రంగంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు దూసుకుపోతూనే ఉంది!’’ అని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *