
జనం న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటికి వస్తానంటూ ఓ వృద్ధురాలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు నెల నెల రూ.50వేలు పింఛన్ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఇండ్ల నాగేశ్వరమ్మకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన ఒక వృద్ధురాలికి ఇచ్చిన మాటను నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు ఒక వృద్ధురాలికి ఇచ్చిన మాటను...నేడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నమస్కరించి ఆశీస్సులు పొందారు. నాగేశ్వరమ్మకు ప్రతీ నెల రూ.5వేలు. ఇకపోతే వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు రూ.50 వేల నగదు అందజేశారు. అలాగే వికలాంగుడైన ఆమె మనవడికి లక్ష రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. ఇకపై తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.5 వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్‌కు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.