హిందువులపై దారుణాలకు వ్యతిరేకంగా నిరసన

*బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

సాక్షి డిజిటల్ న్యూస్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో… ఆ దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో… ఆ దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. అయితే హిందూ సంఘాల నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద భద్రతను పెంచారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు బారీకేడ్లు నెట్టుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన దీపు చంద్ర దాస్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది ప్రదర్శనకారులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కనిపించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మలను కూడా నిరసనకారులు దహనం చేశారు. ఇక, బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగర్‌లోని బలుకాలో డిసెంబర్ 19 డిసెంబర్ 19న 25 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను ఒక గుంపు కొట్టి చంపింది. దీపు చంద్ర దాస్‌ మృతదేహాన్ని దహనం చేశారు. అయితే ఈ హత్యలో పాల్గొన్నారనే ఆరోపణలపై కనీసం 12 మందిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *