తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా వ్యవరించిన నేతలకు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన పోస్టు చేశారు. వివరాలు… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది ప్రధాన ఆరోపణ కాగా… ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబబాద్ సీపీ వీసీ సజ్జనార్ సహా 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఫొన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పపందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని బండి సంజయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘నాతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించి, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైనా సమగ్రంగా దర్యాప్తు చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిట్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమేనని కూడా బండి సంజయ్ అన్నారు. ఎందుకంే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి… కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని సెటైర్లు వేశారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.