ప్రజల గౌరవమే పాలనకు పునాది: పవన్ కల్యాణ్ స్పష్టం

పయనించే సూర్యుడు న్యూస్ : పార్టీ కన్నా,పదవుల కన్నా నన్ను నమ్మిన ప్రజలే నాకు ముఖ్యం.పదవులు అలంకారం కాదు బాధ్యత. ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితిని తీసుకురావద్దు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకులు, కార్యకర్తలకు కోరారు.‘మీకు వచ్చిన పదవులను బాధ్యతగా నిర్వర్తించండి.రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను అధికారాన్ని దుర్వినియోగం చెయ్యకండి, మీరు చేసినట్టు నాకు తెలిస్తే చూస్తూ ఊరుకోను’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఐడియాలజీ గడిచేకొద్దీ విస్తృతంగా కలుపుకునే ఐడియాలజీ తప్పా వేరు చేసే ఐడియాలజీ కాదు.దానికి ఉదాహరణ గానే ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారు.అంటే ఈ భావజాలానికి ఎంత బలం ఉండి ఉండాలి.ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను. సలసల రక్తం మరిగే యువతకి ఇది ఒక వేదిక కావాలి అని పెట్టాను.’అని జనసేన పార్టీ అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.మంగళగిరిలో జనసేన 'పదవి - బాధ్యత' కార్యక్రమంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దాదాపు 4000 మంది పదవుల్లో ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మన భావజాలం యొక్క శక్తి, మన పోరాట పటిమ. ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం! గెలుపులో, సుఖాల్లో అంచనా వేయలేం. ఓటమిలో ఎలా నిలబడతాడు అనే దానిపైన అంచనా వేయగలం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ దృక్పథంతో జనసేన పార్టీ ఏర్పాటు ‘కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయి. మరికొంతమందిని త్వరలో నామినేట్ చేస్తాం. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం. ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు ఇచ్చాం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే గొప్ప అవకాశంగా భావించాలి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం తక్కువగా ఉంటుంది. కేవలం ఎలక్షన్ కోణంలోనే ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ ఉండాలని జనసేన పార్టీని స్థాపించాను. యువతకు ఈ పార్టీ వేదిక కావాలని అనుకున్నాను.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒకే కులానికి నన్ను పరిమితం చేయకండి జనసేన పార్టీకి ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతమంది కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాటశక్తి, పోరాట పటిమ.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘ఏ పార్టీకి అయినా సమున్నతమైన భావజాలం, సిద్దాంతం ఉండాలి. సరైన ఆలోచన విధానం ఉండాలి. జనసేన పార్టీ ఐడియాలజీ, సిద్దాంతాలు బలమైనవి. పదిమందికి ఉపయోగపడేవి. భావితరాలకు ఉపయోగపడాలనే ఏడు సూత్రాలు జనసేన పార్టీ మూల సూత్రాల్లో అంతర్లీనంగా చాలా పెద్ద భావజాలం ఉంది. భావితరాలకు ఉపయోగపడాలనే ఏడు సూత్రాలని ప్రతిపాదించాను. ప్రజాప్రతినిధులు రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినపుడు భారతదేశానికి సంబంధించిన ప్రతి సమస్య మన సమస్యే’అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.‘ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకేంటీ అనుకోవద్దు. దానివల్ల మన యూరియా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రతిదీ మనకు అవసరమే. అన్ని తెలిస్తేనే దేని మీద అయినా బలంగా మాట్లాడగలం. భాష, యాస, సంస్కృతిని గౌరవించాలి. వాటిని కాపాడాలి. వీటిని అర్ధం చేసుకోవాలి. దానికోసం నేను నిలబడ్డాను. మీరంతా నా వెంట నిలబడ్డారు. దేశ సమగ్రత కోసం ఎన్ని ఎత్తులు వేయడానికి నేను సిద్ధం సింగపూర్ తరహా అభివృద్ధి రావాలంటే సింగపూర్ తరహా పాలన రావాలి. సింగపూర్ అభివృద్ధి ప్రదాత, మాజీ ప్రధాని వాంగ్ యూ సొంత మనుషుల్ని కూడా తప్పు చేస్తే వదల్లేదు. అంత బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే టూరిజం కూడా దెబ్బతింటుంది. మాజీ ముఖ్యమంత్రి వచ్చి పోలీసు అధికారుల్ని తిడుతూ...మేం వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటే చాలా తప్పుడు సంకేతం వెళ్తుంది. పర్యాటకం మీదనే కాదు... పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ అది రాంగ్ సిగ్నల్ అవుతుంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.‘శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు ‘పార్టీ కోసం మొదట నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం.కూటమిలో భాగంగా ఇప్పటి వరకు జనసేనకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు లభించాయి. ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా ఆకాంక్ష’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.‘రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను. సంఘవిద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది. అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు. పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు.‘శ్రీ పొట్టి శ్రీరాములు పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలి. పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు.