తెలంగాణ మహిళలకు శుభవార్త!

* ఫ్రీ బస్సు పథకంలో మార్పుల దిశగా ప్రభుత్వం.

జనం న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంకు సంబంధించి కీలక మార్పు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఇందుకోసం మహిళలు తెలంగాణ స్థానికతో కూడిన ఒర్జినల్ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. మహిళలు గుర్తింపు కార్డును చూపి వారు ప్రయాణిస్తున్న చోటుకు జీరో టికెట్ తీసుకోవాలి. అయితే తాజాగా ఈ పథకంలో కీలక మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భభట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం రోజున ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి చేరినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ప్రత్యేక కార్డుల పంపిణీకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని సూచించినట్టుగా చెప్పారు. తెలంగాణలో ప్రతి మహిళ ఈ సౌలభ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని. ఇప్పటివరకు మహిళలు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని. ఇది తెలంగాణ మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆవిర్భావం తరువాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *