రేపటి నుంచి కొత్త అధ్యాయం! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటా విషయంలో కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటా విషయంలో కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే నీటి విషయంలో కూడా పోరాడకుంటే ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అని ప్రశ్నించారు. ఇంత చేతగాని, నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎలా?… 10 టీఎంసీల నీటి వాటాను కోల్పోతేనే ఒక్కొక్క రాష్ట్రం దానిని సాధించుకునేందుకు బలంగా పోరాడుతుందని అన్నారు. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులను ఆగం చేస్తే పరిస్థితి వస్తే పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. ఈరోజు సమావేశంలో పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే చర్చ జరిగిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు అని. ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీలు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ కానీ.. దాదాపు 20 ఏళ్లు పాలించిన టీడీపీ కానీ. పాలమూరు తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టాయని ఆరోపించారు. అప్పర్‌ కృష్ణా, బీమా, తుంగభద్ర ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా ఆనాటికి 174 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి రావాల్సి ఉండేదని అన్నారు. బీజేపీ తెలంగాణకు శనిలా తయారయ్యిందని కేసీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని, ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్ళు వేశాడని విమర్శించారు. ఈ పునాది రాళ్ళను తీసుకెళ్లి కృష్ణానదిలో అడ్డం వేస్తే చెక్ డ్యామ్‌ అయ్యేది అని ఉద్యమం సమయంలో తాను అనేవాడిని అని అన్నారు. ఇదిలాఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాలు, కమిషన్‌లు తప్ప… రాష్ట్ర ప్రజలు, రైతులు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను ఎందుకు నిర్వీర్యం ఎందుకు చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పరిణామాల వెనక ఎవరి ఒత్తిడి ఉంది?, ఏం కుట్ర దాగి ఉంది? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నేను మౌనం పాటిస్తూ చూసుకుంటూ వచ్చాను ఇక తప్పనిసరి పరిస్థితులో నేను బయలుదేరాను. కేంద్రం తీరును బయటపెడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతాం. ఈ రోజు సమావేశంలో విస్తారంగా చర్చించాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడతాం. తప్పకుండా పాలమూరు-రంగారెడ్డి – నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పోస్టర్ డిజైన్ జరుగుతుంది. భారీ బహిరంగ సభలు పెడతాం, బహిరంగ సభలకు నేను స్వయంగా హాజరవుతాను. ప్రజా క్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. తెలంగాణ తరఫున ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకుంటే ఎవరు మాట్లాడాలి? మా మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండోది ప్రధాన ప్రతిపక్షంగా మా డ్యూటీ మేము చేస్తాం. అడ్డం పొడువు మాట్లాడి కారుకూతలు కూస్తామంటే నడవది. ఇయ్యాల్టీ దాకా వేరు కథ, రేపటి నుంచి వేరే. ఎక్కడికక్కడ తోలు తీస్తాం. మేము వాళ్లు అధికారంలోకి వచ్చారని, మేము అధికారం కోల్పోయామని పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. ఈ ప్రభుత్వానికి సరిపడ సమయం ఇచ్చాం. కేవలం ఇష్యూలపై, దోపిడీలపై, దందాలపై మాత్రమే పోరాడాం. గోదావరిపై ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపితే దాని మీద సప్పుడు లేదు. కృష్ణా జలాల్లో పాలమూరు ఎత్తిపోతల విషయంలో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు?, ఏం చేయడానికి ఉన్నట్టు?, రాష్ట్రంలో ఏం జరుగుతున్నట్టు?. నేను రంగంలోకి దిగుతున్నాను… ఈరోజు నిర్ణయం కూడా జరిగింది. రెండు, మూడు రోజులలో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజలకు జరిగే అన్యాయాన్ని, జల దోపిడీని అడ్డుకుని తీరుతాం. తెలంగాణ కోసం ఎక్కడిదాకైనా పోతాం, ఎవరితోనైనా కొట్లాడుతాం. రాష్ట్రం హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని దుర్మార్గాల జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉండాలి’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ది, పారిశ్రామికీకరణ, ఐటీ రంగంలో, లా అండ్ ఆర్డర్‌లో క్రమ పద్దతిలో ముందుకు వెళ్లిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *