టీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల

పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను (లోక్‌సభ నియోకవర్గాల అధ్యక్షులను) ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను (లోక్‌సభ నియోకవర్గాల అధ్యక్షులను) ప్రకటించింది. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శల జాబితాను సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను టీడీపీ అధిష్టానం అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు సంబంధించిన ఎంపికపై కసరత్తు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో నేతల సామాజిక సమీకరణలు, సామర్థ్యం, సీనియారిటీ ఆధారంగా ఈ ఎంపిక చేపట్టినట్టుగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలలో బీసీలు-8, మైనార్టీలు-1, ఓసీలు-11, ఎస్సీలు-4, ఎస్టీలు-1 ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వివరాలు  1. అనకాపల్లి - బత్తుల తాతయ్య బాబు 2. అరకు- మోజోరు తేజోవతి 3. శ్రీకాకుళం - మోదవలస రమేశ్ 4. విశాఖ- చోడే వెంకట పట్టాభిరాం 5. విజయనగరం - కిమిడి నాగార్జున 6. బాపట్ల - రాజశేఖర్ బాబు 7. గుంటూరు - పిల్లి మాణిక్యరావు 8. మచిలీపట్నం - వీరంకి గురుమూర్తి 9. నర్సరావుపేట - షేక్ జాన్ సైదా 10. విజయవాడ - గద్దె అనురాధ 11. అమలాపురం - గుత్తల సాయి 12. ఏలూరు- బడేటి రాధాకృష్ణ 13. కాకినాడ- జ్యోతుల నవీన్ 14. నర్సాపురం - మంతెన రామరాజు 15. రాజమండ్రి - బొడ్డు వెంకటరమణ చౌదరి 16. అనంతపురం - పూల నాగరాజు 17. హిందూపురం - ఎం.ఎస్. రాజు 18. కడప- చదిపిరాళ్ల భూపేష్ 19. కర్నూలు- గుడిశె కృష్ణమ్మ 20. నంద్యాల- గౌరు చరితా రెడ్డి 21. చిత్తూరు - షణ్ముగ రెడ్డి 22. నెల్లూరు- బీద రవిచంద్ర 23. ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి 24. రాజంపేట - సుగవాసి ప్రసాద్ 25. తిరుపతి - పనబాక లక్ష్మి