విద్యపై డిప్యూటీ సీఎం బలమైన స్టేట్‌మెంట్

★అసమానతలకు ముగింపు దిశగా

సాక్షి డిజిటల్ న్యూస్: సామాజిక అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యం, మానవ విలువలు ఉన్న విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. దీర్ఘకాల అభివృద్ధికి మానవ మూలధనం లోతైన పునాది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపడమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాలలో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... నైపుణ్యంతోపాటు మానవ విలువలు కలిగిన విద్యను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా భారత్ ఫీచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని కొనియాడారు. రాష్ట్రంలోని 100 ఐటిఐ లను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం వీటి ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. విద్యతనే సామాజిక అసమానతలు రూపుమాపుతాయి సామాజిక ఆసమానతలను రూపుమాపే లక్ష్యంతో అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో పాఠశాలను 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నా మని...రాష్ట్రంలో 100 పాఠశాలల నిర్మాణానికి మంజూరు చేశామని.. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నా యని డిప్యూటీ సీఎం తెలిపారు. సమాజంలోనీ వ్యవస్థలు, సంస్థల్లో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిపెక్(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల) సర్వే ద్వారా మరింత స్పష్టమైనదని డిప్యూటీ సీఎం వివరించారు. సుదీర్ఘకాలం అభివృద్ధి, నాయకత్వం వహించాలంటే లోతైన మానవ మూల ధనమే పునాది అని అగ్రదేశాలను లోతుగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒక లక్ష్యంతో నడిచే విద్య క్యాంపస్ గోడలను దాటి దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని లోయోలా అకాడమీ నిరూపిస్తోంది అన్ని డిప్యూటీ సీఎం తెలిపారు. లయోలా సంవత్సరాల ప్రయాణం అనేది చిన్న విషయం కాదు. ప్రధానంగా విద్యారంగంలో అది మరింత కఠినమైన ప్రయాణం. తరాలు మారినా, సాంకేతికతలు మారినా, విధానాలు మారినా, అంచనాలు మారినా తన ఆత్మను కోల్పోకుండా కొనసాగడం అంటే సాధారణ విజయం కాదు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత 50 సంవత్సరాలు పూర్తి చేసిన సంస్థలకు సాధారణంగా జ్ఞానం మరియు కథలు అర్థమవుతాయి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కానీ లయోలా అకాడమీకి మూడవది కూడా వచ్చింది అదే వేగం, ఉత్సాహం. యాభై ఏళ్లు పూర్తయినా ఇంకా ఎక్కువ చేయాలనే తపనతో ఉన్న సంస్థగా లయోలా కనిపిస్తుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. 10 రోజుల క్రితం తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలనే మా లక్ష్యం గురించి నేను మాట్లాడాను. ఆ సందర్భంలో నేను ఒక సరళమైన సూత్రాన్ని ప్రతిపాదించాను అని డిప్యూటీ సీఎం వివరించారు. మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత. నిజం చెప్పాలంటే ఆ ఒక్క వాక్యం సమాజంలో ఇంతగా విస్తరిస్తుందని నేను ఊహించలేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. సమ్మిట్ అనంతరం పరిశ్రమ, అకాడమిక్ రంగం, ప్రభుత్వం నుంచి అనేక మంది నన్ను సంప్రదించి...“ఆ సమీకరణ మాతోనే ఉండిపోయింది” అని చెప్పారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.కొంతమంది అంగీకరించారు...కొంతమంది ప్రశ్నించారు...కానీ ముఖ్యంగా ఆ కొత్త ఉత్పాదకత సూత్రం ఆలోచనను రేకెత్తించింది అని పలు వర్గాలవారు తనతో ప్రస్తావించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒకఆలోచన చర్చకు వస్తే అది నిజమైన లక్ష్యాన్ని చేరినట్లే ఒక ఆలోచన వేదికను దాటి చర్చకు వస్తే...అది నిజమైన లక్ష్యాన్ని చేరిందని అర్థం చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. యాభై సంవత్సరాలుగా కేవలం మౌలిక వసతులు కాదు, మానవ మేధస్సును నిర్మిస్తున్న ఈ సంస్థలో నిలబడి, ఆ ఆలోచనను పూర్తిచేయడానికి ఇదే సరైన క్షణంగా అనిపిస్తోంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. మూలధనం, ఆవిష్కరణలు ఎంత ముఖ్యమైనవైనా, అవి ఆధారపడే లోతైన పునాది ఉంది ఒకటి ఉంది అదే మానవ మూలధనం (Human Capital) అన్నారు.గొప్ప దేశాలు సాధారణంగా తమ మొదటి వృద్ధి దశను మూలధన పెట్టుబడులన ద్వారానే సాధిస్తాయి అది నౌకాశ్రయాలు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్ వ్యవస్థలు, నగరాలు నిర్మించడం ద్వారానే బ్రిటన్ పారిశ్రామిక విప్లవ సమయంలో ఇదే చేసింది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సాధించింది అమెరికా సంయుక్త రాష్ట్రాలు రైల్వేలు, హైవేలు, విద్యుదీకరణ ద్వారా విస్తృత మౌలిక వసతులను నిర్మించాయి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత క్రమబద్ధమైన మూలధన నిర్మాణం, తయారీ రంగ బలం, ఇంజినీరింగ్ నైపుణ్యంతో తిరిగి ఎదిగింది అన్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ దేశాల్లో ఏదీ మూలధనంతో మాత్రమే దీర్ఘకాల నాయకత్వాన్ని నిలుపుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఆయా దేశాల రెండో దశ మరింత శక్తివంతమైన వృద్ధి దశ మానవ మూలధనం కేంద్రబిందువైనప్పుడే సాధ్యమైంది అని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సాధించింది కేవలం కర్మాగారాలు నిర్మించినందుకు కాదు...విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, రిస్క్ తీసుకునే ధైర్యాన్ని ప్రోత్సహించే వ్యవస్థను నిర్మించినందుకు అని డిప్యూటీ సీఎం వివరించారు. జర్మనీ బలం యంత్రాల్లో మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, చేతి పనికి మరియు జ్ఞానానికి గౌరవం ఇచ్చే సంస్కృతిలో ఉంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.