బీజేపీలో చేరిన నటి ఆమని-కండువా కప్పి ఆహ్వానించిన స్టేట్ చీఫ్ రామ్‌చందర్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో నటి ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీలో చేరారు. నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో నటి ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమనికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన రాంచంద్రరావు... అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆమని తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమని... ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో అలరించడమే కాకుండా, బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. అఅయితే తాజాగా ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక, సినీ రంగానికి చెందిన మేకప్ ఉమెన్ శోభలత కూడా ఈరోజు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారని, వాటి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మోదీ నాయకత్వంలో భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు. మోదీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరానని తెలిపారు. సనాతన దర్మం కోసం మోదీ ఎంతగానో చేస్తున్నారని వీటిన్నింటిపై స్పందించాలని తాను పార్టీలో చేరినట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ జంబలకిడిపంబ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమని అనేక తెలుగు చిత్రాల్లో నటించారని చెప్పారు. అలాగే ఇతర భాష చిత్రాల్లో కూడా నటించారని తెలిపారు. పలువురు లీడిండ్ హీరోల సరసన ఆమని నటించారని ఇప్పుడు సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్నారని అన్నారు. ఆమని, శోభలతలకు పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ పనితీరుతో ప్రభావితమై బీజేపీలోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మద్దతు పెరిగిందని అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన దాదాపు వెయ్యి మంది విజయం సాధించారని చెప్పారు. పట్టణాలకు పరిమితమైన బీజేపీ... ఇప్పుడు గ్రామీణ తెలంగాణలో మంచి పట్టు సాధించే విషంగా ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని అన్నారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమను ఆదరిస్తున్న ప్రజలనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు.