డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన స్టేట్‌మెంట్

★సభలో ఉత్కంఠ

సాక్షి డిజిటల్ న్యూస్ : పవన్ కల్యాణ్‌కు అధికారంలో ఉన్నా లేకపోయిన పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఎవడికీ భయపడడు.ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్తామా లేదా అనేది డిసైడ్ అయ్యే బయటకు వస్తా.అలాంటిది మీలాంటి ఆకు రౌడీలకు భయపడతానా?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే పర్వాలేదు. కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను గుర్తుపెట్టుకోండి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు భయపడలేదు. దౌర్జన్యాలకు భయపడలేదు. మిమ్మల్ని తగ్గించడం కూడా ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఒక్కొక్కరిని చంపేస్తాం. మేం మళ్లీ వస్తాం అని బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు మేం భయపడాలా?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.చివరికి పిఠాపురంలో కూడా చిన్నపిల్లల మధ్య క్యాస్ట్ ఫీలింగ్స్ తీసుకువస్తే నేనేం మాట్లాడను. మీ దిగజారుడుతనానికి నేనేం చెప్పను. మీ అధోగతి గురించి నేనేమి మాట్లాడగలను. ప్రకృతిని ప్రేమించేవాడు...తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులేనా ఇవి. కులాలను చిన్నపిల్లలకు అంటగడతారా?ఆపాదిస్తారా?పాలిటిక్స్ గురించి మాట్లాడే వారికి వేరే దారుల్లేవా. సిగ్గుందా అలా చేసే వారికి?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. యోగి ట్రీట్మెంట్ సరిపోతుంది ‘మాకు నోరు లేదనుకుంటున్నారా? మేం ఏమీ చేయలేం అని అనుకుంటున్నారా? ఇంట్లో కూర్చుని కాంట్రాక్టులు తీసుకుంటే జైళ్లో పెడతారని బెదిరిస్తారా? అసలు మీగురించి మీరేమనుకుంటున్నారు. మేం ఏమీ మారలేదు. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే పవన్ కల్యాణ్‌కు అధికారంలో ఉన్నా లేకపోయిన పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. ఎవడికీ భయపడడు.ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వెళ్తామా లేదా అనేది డిసైడ్ అయ్యే బయటకు వస్తా.అలాంటిది మీలాంటి ఆకు రౌడీలకు భయపడతానా?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.ఆకురౌడీలకు అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకని అడిగితే ఏవేవో చెవిలో చెప్తున్నారు.వాళ్లు మంచి వాళ్లు కాదు..వాళ్ల వెనుక కిరాయి రౌడీలు ఉంటారని అధికారులు చెప్తున్నారు. అలాంటి వారికి యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్. యోగి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పొలిటికల్ నిర్ణయం తీసుకునే వరకు తీసుకెళ్లకండి ‘ఒక్కొక్కడికి రౌడీయిజం అంటే కాలుకి కాలు,కీలుకు కీలు, మక్కికి మక్కి తీసేసి మడతపెట్టి కింద కూర్చోబెడితే దారిలోకి వస్తారు. ప్రభుత్వం తలచుకుంటే బలమైన నక్సలిజం కకా వికలమైపోయింది. అలాంటిది మీరెంత?’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘అలాంటిది ప్రభుత్వం ఉండి...వేలాది మంది పోలీసులు, ఐపీఎస్‌లు వేలాది మంది డీఎస్పీలు ఉండి అలాంటి కిరాయి గ్యాంగ్‌లను మెయిన్‌టైన్ చేసే వారిని రెండు రోజులు గమనించి వారి వెనుక ఎవరు ఉన్నారు ఏంటని పూర్తి డిటైల్స్ తీసుకుని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్లీ ఇలాంటి మాటలు రావు. అక్కడి వరకు తీసుకెళ్లకండి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సున్నితంగా హెచ్చరించారు.