ఏపీ యువతకు పెద్ద అప్‌డేట్

★ నోటిఫికేషన్లపై కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేశ్.

జనం న్యూస్: వచ్చే ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఇప్పటికే 16వేల డీఎస్సీ ఉద్యోగాలు, 6014 మంది కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేసిన ప్రభుత్వం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలను సైతం కల్పిస్తుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ తెలిపారు. నిరుద్యోగులకు పండగలాంటి తీపికబురు చెప్పారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే మరో నెల రోజుల్లో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. ఈ జాబ్‌క్యాలెండర్ల ద్వారా ఎప్పుడు, ఏ నోటిఫికేషన్ విడుదల కానుందో తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం నిరుద్యోగులు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకునేందుకు వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారుజనవరిలో జాబ్ క్యాలెండర్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే పలు ఉద్యోగాలను సైతం కల్పించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ పూర్తి చేసిన 16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని. ఇటీవల 6 వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు అందించినట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.రాష్ట్రానికి గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, కాగ్నిజెంట్‌లో 25 వేల ఉద్యోగాలు అందించనున్నట్లు వెల్లడించారు.