ఆ ఎంపీలకే పార్లమెంట్‌లో ప్రాధాన్యత

★కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

సాక్షి డిజిటల్ న్యూస్: ప్రభుత్వ బాధ్యత ప్రతిపక్షాల గొంతు వినడం, ఆ తర్వాత స్పందించడమేనని తాను భావిస్తున్నానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వ బాధ్యత ప్రతిపక్షాల గొంతు వినడం, ఆ తర్వాత స్పందించడమేనని తాను భావిస్తున్నానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అందుకే తాను చాలాసార్లు ప్రతిపక్షాలు మాట్లాడేది వింటానని, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా వింటానని చెప్పారు. అయితే పార్లమెంట్‌లో చర్చలకు అంతరాయం కలిగించని ఎంపీలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టైమ్స్ నెటర్ నిర్వహించిన ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ (ఐఈసీ) 2025 కు కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సందర్భంగా టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ నవికా కుమార్‌ అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఏ క్వాలిటీ అత్యంత అవసరమని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు స్పందిస్తూ... అన్నింటికంటే ముందుగా, ప్రతిపక్షాల గొంతు వినడం... ఆ తర్వాత స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని భావిస్తున్నానని తెలిపారు. బిగ్గరగా మాట్లాడేవారైనా, వాక్చాతుర్యం ఉన్నవారైనా, ఎవరైనా సరే, సభ సజావుగా పనిచేస్తేనే సభ్యుల గొంతు లేదా అభిప్రాయాలు వినడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే తన అభిప్రాయం ప్రకారం... సభ సజావుగా పనిచేయడానికి అనుమతించే వారే మంచి వ్యక్తులు అని చెప్పు కొచ్చారు. మంచిగా ఉన్న వారిలో కొందరి పేర్లు చెప్పగలరా అని అడిగినప్పుడు కిరణ్ రిజిజు స్పందిస్తూ... ‘‘కాంగ్రెస్ పార్టీలో కూడా, ఈసారి నేను కొంతమంది కొత్త ఎంపీలను చూశాను, వారు చాలా వాక్చాతుర్యం ఉన్నవారు’’ అని అన్నారు.