
సాక్షి డిజిటల్ న్యూస్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా? అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను తీసుకున్నవారిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లో జైలు వేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించడంపై లోకేష్ స్పందించారు. జగన్ అరెస్ట్ చేస్తామంటే తాము భయపడాలా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలులో పెట్టి ఏం పీకారు? అంటూ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు... ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు... అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నాడు... మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైలులో బంధించి ఏం పీకావు... నువ్వు అరెస్ట్ చేస్తామంటే మేము భయపడాలా?... నీకన్నా ముందు కూడా చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు... వారి పరిస్థితి ఏమైందనేది ఒకసారి ఆలోచించుకో... ఎర్ర బుక్ (రెడ్ బుక్)లో మూడు పేజీలు అయ్యాయి... ఇంకా చాల పేజ్‌లు ఉన్నాయి... ఎవరికి ఎప్పుడూ ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు... చట్టాన్ని ఉల్లంఘించినవారిని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు’’ అని అన్నారు. కార్యకర్తలే తమ అధినేత అని అన్నారు. నాయకులు వస్తారు, వెళ్తారు... కార్యకర్తలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సొంతం అని పేర్కొన్నారు. అబద్దం తియ్యగా ఉంటుందని... నిజం చేదుగా ఉంటుందని అన్నారు. తాను నిజం చెప్పే వ్యక్తిని అని... ఉన్నది ఉన్నట్టుగా చెబుతానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలందం ఒక కుటుంబం అని అన్నారు. తన మనసులో ఏమున్నా పలికినప్పుడు ప్రేమగా పలుకుతానని... కోపమస్తే అంతే ఘాటుగా చెబుతానని... ఇది పార్టీ మంచి కోసమేనని అన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారని... అయితే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మరో వందేళ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, లోకేష్ ఈరోజు రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన లోకేష్... యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను ప్రారంభించారు. మంజీరా బ్లాక్ పేరుతో నూతనంగా నిర్మించిన ఎగ్జామినేషన్ బిల్డింగ్, గౌతమి బ్లాక్ పేరుతో నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంద్రావతి బ్లాక్ పేరుతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ భవనాలను ప్రారంభించి... విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. ఇక, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక వద్ద ‘హలో లోకేష్’ పేరుతో లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ ఎన్ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషిచేయాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ స్త్రీలను గౌరవించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అందరూ ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్రారంభించాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు సాధించడానికి అకడమిక్స్‌తో ఇండస్ట్రీని అనుసంధానిస్తామని... స్కిల్ గ్యాప్ భర్తీ చెయ్యడానికి త్వరలోనే నైపుణ్యం పోర్టల్ తీసుకురాబోతున్నామని తెలిపారు.