రాజకీయ నాయకుల జోక్యం సహించం

* భూ వివాదాలపై పవన్ కల్యాణ్ హెచ్చరిక.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు అని పోలీస్ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. మరోవైపు భూ వివాదాలలో రాజకీయ నాయకుల జోక్యం ఉందని తేలితే వారిని కూడా వదలొద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చారు. కొందరు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నారు. చర్యలు తీసుకోకపోవటం ఇబ్బందికరం. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదు అని అన్నారు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కోంటున్నాం. కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశిస్తున్నాం. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల అలక్ష్యంగా ఉండొద్దు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. భూవివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని సహించొద్దు: పవన్ కల్యాణ్. ‘విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయి. విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దు’అని ఆదేశించారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.మతంపేరుతో విపరీతమైన సౌండ్స్ చేయడం తప్పు: పవన్ కల్యాణ్ ‘మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పు. ఎక్కడైనా కేవలం చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయి. నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏపీలో 5.5 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయి:డీజీపీ హరీశ్ గుప్తా. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్త చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు 5.5 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2023 డిసెంబరు నుంచి నవంబరు 2024 వరకు 110111 నేరాలు నమోదైతే, డిసెంబరు 2024 నుంచి నవంబరు 2025 మధ్య కాలంలో 104095 నేరాలు నమోదయ్యాయని తెలిపారు. ప్ర‌ధానంగా 26 జిల్లాల్లో నేరాల చాలా త‌క్కువ‌గా న‌మోద‌య్యాయ‌ని చెప్పారు. ఇందులో గొడవలు, అల్లర్లు వంటి సంఘటనలు గణనీయంగా తగ్గాయన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 52.4 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలపైన నేరాలు తగ్గాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ నేరాలు 22.35 శాతం తగ్గాయని చెప్పారు. మహిళల భద్రత కూడా పెరిగిందని చెప్పారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ లో 4శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *