జనం న్యూస్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. ఈకేసులో అత్యంత కీలకమైన ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో డీవోపీటీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ రెండుసార్లు లేఖలు రాశామని సీఎం చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ విచారణకు అనుమతి అవసరం అని అన్నారు. అరవింద్ కుమార్ విచారణకు సంబంధించి అనుమతి కోసం ఇప్పటికే డీవోపీటీకి రెండుసార్లు లేఖలు రాసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.డీవోపీటీ నుంచి అనుమతులు రాగానే చర్యలు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతులు వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎవరైనా ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నదే తమ పాలసీ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పిల్లల లాగా మేం పబ్బులకు తిప్పట్లేదు. మరోవైపు ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ఈవెంట్‌కు తన మనువడిని తీసుకురావడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పిల్లల లాగా మేం పబ్బులకు తిప్పట్లేదు అని చెప్పుకొచ్చారు. నా మనువడిని ప్లేయర్‍ని చేయాలని ఉంది. ఫుట్‌బాల్ ఆడించాలనే నా మనవడిని స్టేడియంకు తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చారు.ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తారు. అందుకే ఫుట్ బాల్ ఆడించాలనే నా మనువడిని తీసుకెళ్లానని చెప్పారు.మరోవైపు మెస్సీ ఈవెంట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఇది పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమం అని క్లారిటీ ఇచ్చారు. మెస్సీ ఈవెంట్‌కు తాను కూడా గెస్ట్‌గా మాత్రమే వెళ్లానని వివరణ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. ఫుట్‌బాట్ ఆడించడానికి మాత్రమే మనవడితో వెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి వివరణ చెప్పుకొచ్చారు.మరోవైపు చాలా మంది ఉద్యోగులు ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చి ఉద్యోగాలు పొందారని. ఫేక్ ఆధార్ కార్డులతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఫొరెన్సిక్ ఆడిట్ చేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్,హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు ఇవే. కేటీఆర్ కాంగ్రెస్ గురించి కాకుండా హరీశ్ రావు గురించి ఆలోచిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు తన వెనకాల గోతులు తవ్వుతున్నారని కేటీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను తప్పించాలని హరీశ్ రావు వర్గం ఇప్పటికే ప్రచారం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వాన్ని మార్చాలని హరీశ్ రావు ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. హరీశ్ రావు ప్రయత్నాన్ని తిప్పి కొట్టేందుకే కేటీఆర్ పర్యటనలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఊడుతుంది:హరీశ్ రావు కౌంటర్. ‘నాకు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని. తద్వారా బీఆర్ఎస్‌ను బలహీన పరచాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడు’ అని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు.కేటీఆర్ వెనకాల తాను గోతులు తవ్వుతున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కుతున్నాడు’ అని హరీశ్ రావు మండిపడ్డారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో అడ్డగోలుగా వాగాడు అంటూ మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.