పోలీసుల విచారణకు హాజరైన వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డి

జనం న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డిని పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో పోలీసులు అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం అర్జున్ రెడ్డి ఈరోజు గుడివాడ టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. దీంతో పోలీసులు అర్జున్ రెడ్డిని విచారించారు. విచారణ అనంతరం అర్జున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ మాట్లాడుతూ. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 2024లో సిరిగిరి అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇటీవల ఆయనకు 41 ఏ నోటీసులిచ్చామని తెలిపారు. కేసు విషయమై ఆయనను విచారించామని. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. అసలేం జరిగిందంటే. వైఎస్ జగన్‌కు అర్జున్ రెడ్డి సమీప బంధువు. వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాల్లో అర్జున్ రెడ్డి యాక్టివ్‌గా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను మార్ఫింగ్ చేసి, అభ్యకర రీతిలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేశారని అర్జున్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అర్జున్ రెడ్డి విదేశాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *