ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ ఎందుకు కష్టం?

★కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానం!

సాక్షి డిజిటల్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ నెలలో కూడా వాయు కాలుష్యంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే వాయు కాలుష్య నియంత్రణ అవకాశాలను నిర్లక్ష్యం చేసినందుకు గత ప్రభుత్వాలను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ నెలలో కూడా వాయు కాలుష్యంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పలు ప్రశ్నలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ స్పందించారు. వాయు కాలుష్య నియంత్రణ అవకాశాలను నిర్లక్ష్యం చేసినందుకు గత ప్రభుత్వాలను భూపేందర్ యాదవ్ విమర్శించారు. తాము అమలు చేస్తున్న చర్యలు ప్రభావం చూపడానికి సమయం పడుతుందని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్‌ 2025కు భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. పంట వ్యర్థాల దహనం ఆపివేశారని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉందని... మరి దేశ రాజధానిలో వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారా?, పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడిందా? అనే ప్రశ్నలుకు ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాలు వారికి అవకాశం వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని భూపేందర్ యాదవ్ విమర్శించారు. ‘‘ప్రభుత్వాలు (గత) వారి పాలన సమయంలో ఏమీ చేయలేదు. వాతావరణపరంగా పాశ్చాత్య అవాంతరాలు డిసెంబర్‌లో వస్తాయి. మేము బహుళ చర్యలను అమలు చేస్తున్నాము. ఈ ప్రయత్నాల ఫలితాలు రాబోయే సంవత్సరాల్లో కనిపిస్తాయి’’ అని ఆయన చెప్పారు.