లేబర్ కోడ్స్‌పై సందేహాలకు ముగింపు

★ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా వివరణ

సాక్షి డిజిటల్ న్యూస్: స్వాతంత్య్రానికి పూర్వం నాటి 26 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు ఏకీకృత 'లేబర్ కోడ్‌ల'ను తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం నాటి 26 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు ఏకీకృత 'లేబర్ కోడ్‌ల'ను తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరించారు. ఈ సంస్కరణలు భారతదేశ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి రూపొందించబడ్డాయి అని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ (ఐఇసి) 2025లో మాండవీయా మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రెండు ప్రధాన బలాలైన యువశక్తి, కార్మికశక్తిలపై దృష్టి పెట్టాలని తనను కోరారని చెప్పారు. ఈ రెండూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించడానికి కీలకమని అన్నారు. భారతదేశ అభివృద్దిలో కార్మికశక్తి ముఖ్యమైన పిల్లర్‌గా ఉంటుందని మన్సుఖ్ మాండవీయా అన్నారు. 40 కోట్లకు పైగా కార్మికులు మాన్యువల్ లేబర్, వేతన పని, జాతి నిర్మాణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటంతో... ప్రభుత్వం కార్మికులను దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రత్యక్షంగా దోహదపడే ప్రాధాన్యతా విభాగంగా చూస్తుందని మాండవీయా అన్నారు. గత శతాబ్దంలో పని పరిస్థితులు, ఉపాధి విధానాలలో గణనీయమైన మార్పులు ఉన్నప్పటికీ... స్వాతంత్య్రానికి ముందు రూపొందించిన 26 కార్మిక చట్టాల ద్వారా భారతదేశంలో పాలన సాగుతూనే ఉందని మన్సుఖ్ మాండవీయా అన్నారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం రూపొందించిన కార్మిక చట్టాలు చాలా భిన్నమైన పరిస్థితులకు చెందినవని అన్నారు. ఆ సమయంలో జాబ్ స్ట్రక్చర్స్, వర్క్‌ప్లేస్ రియాలిటీస్.. ఈరోజు మాదిరిగా లేవని గుర్తుచేశారు. అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ చట్టాలు అమలులో ఉన్నాయని అన్నారు. స్వాంతంత్య్రం తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో లేదా పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే పరిస్థితులను సృష్టించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ... విధాన రూపకల్పన రెండింటి మధ్య పరస్పర ఆధారపడటాన్ని గుర్తించాలని మన్సుఖ్ మాండవీయా అన్నారు. పరిశ్రమలు కార్మికులు లేకుండా పనిచేయలేవని... పరిశ్రమలు విస్తరించకపోతే కార్మికులు ఉద్యోగాలు పొందలేరని ఆయన తెలిపారు. దానిని సమతుల్యత చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి అంశాలకు పరిష్కారంగా కొత్త లేబర్ కోడ్స్ ఉంటాయని అన్నారు. మోదీ ప్రభుత్వ పాలనా విధానాన్ని ప్రస్తావిస్తూ... మోదీ పరిపాలన ‘‘సంస్కరణ, పనితీరు, పరివర్తన’’పై దృష్టి సారించిన అభివృద్ధి-కేంద్రీకృత నమూనాకు మారిందని మాండవీయా అన్నారు.ఇది ప్రస్తుత కార్మిక చట్టాలను సమగ్రంగా సమీక్షించి... వాటిని ఆధునీకరించాలనే నిర్ణయానికి దారితీసిందని ఆయన అన్నారు. పాత కార్మిక చట్టాలు ప్రస్తుత జనరేషన్‌కు అనుకూలంగా ఉన్నాయా? అని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగు కార్మిక చట్టాలుగా ఏకీకృతం చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ కొత్త లేబర్ కోడ్‌లను 2019-20లలో పార్లమెంటు రెండేళ్ల వ్యవధిలో ఆమోదించిందని గుర్తుచేశారు. అయితే వాటి అమలు వెంటనే జరగలేదని మన్సుఖ్ మాండవీయా అంగీకరించారు. కొత్త లేబర్ కోడ్‌లను ప్రధానమంత్రి మోదీ త్వరగా అమలు చేసేలా చూడాలని చెప్పారని తెలిపారు. అయితే కొత్త లేబబర్ కోడ్‌ల చుట్టూ గణనీయమైన చర్చ, విమర్శలు జరిగాయని ఆయన అన్నారు. కార్మిక సంఘాల ఆందోళనలను, సంస్కరణలకు వ్యతిరేకతకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి తాను వ్యక్తిగతంగా వారితో విస్తృత చర్చలు జరిపానని ఆయన చెప్పారు.