బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు

★ కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకున్న తాటికొండ రాజయ్య.

జనం న్యూస్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.సిగ్గు,శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి అని సవాల్ విసిరారు. ఒకవేళ రాజీనామా చేయకపోతే వీధివీధినా కడియం శ్రీహరి దిష్టిబొమ్మ వేలాడదీస్తామని రాజయ్య హెచ్చరించారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చరిత్ర హీనుడి మాదిరిగా కడియం శ్రీహరి వివరణ ఇచ్చారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో గురువారం తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరికి నైతిక విలువలు లేవు అని ధ్వజమెత్తారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్నా అని. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతారంటూ రాజయ్య ప్రశ్నించారు. రామా కృష్ణా అంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు అంటూ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి ఆ తర్వాత ఆ పార్టీని. పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని తాటికొండ రాజయ్య తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానంటూ కడియం డైలాగులు కొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పార్టీకి చేసిన కీడుకు మందు కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇకనైనా కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ వీధిలో కడియం దిష్టిబొమ్మ వేలాడదీస్తాం: తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీమంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.గతంలో అనేకసార్లు తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని బహిరంగ ప్రకటన చేసి ఇప్పుడేమో బీఆర్ఎస్‌ను వీడలేదు అని అటారా? అని నిలదీశారు. కడియం శ్రీహరి నీతిమాలిన మాటలతో సభ్య సమాజమే సిగ్గుపడుతోంది అని ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను వేళాడదీస్తామని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పైనా రాజయ్య మండిపడ్డారు.ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని...పట్టపగలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని మాజీమంత్రి రాజయ్య విరుచుకుపడ్డారు.నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు: కడియం శ్రీహరి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. స్పీకర్‌ నోటీసులపై బుధవారం లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యతం రద్దుచేసుకోలేదు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను తాను ఎక్కడ కూడా ప్రకటించలేదు అని వివరణ ఇ్చారు.కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. అయితే కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఐదుగురిపై అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం ప్రకటించారు. మొత్తం 10 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అనర్హత పిటిషన్‌లు దాఖలు చేసింది. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు (అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి)లపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ బుధవారం (డిసెంబర్ 17) తన నిర్ణయాన్ని వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ (కాంగ్రెస్)లో చేరినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించింది.