ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచితే తప్పు

* వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్.

జనం న్యూస్: కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి అని వెంకయ్య నాయుడు సూచించారు.ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్న నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ. కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మవిభూషణ్,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కైకలూరు గుడివాడ ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ,నాట్స్, ఐఎంఏ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసి సభా కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మూలాలను ఎట్టి పరిస్థితుల్లో మరచిపోకూడదు: వెంకయ్య నాయుడు. బాల్య దశలో తన జీవన శైలివిధానాన్ని సభా వేదికగా వెంకయ్య నాయుడు వివరించారు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుండి గుడివాడ అంటే తనకు ఇష్టమని. విద్యార్ది ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చానని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.కన్న తల్లి, జన్మ భూమిని మర్చిపోకుండా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. మనం ఏ స్థాయికి చేరుకున్న మూలాలను మర్చిపోకూడదని హితవు పలికారు. విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవడం కంటే. మాతృమూర్తి, మాతృ దేశానికి సేవ చెయ్యడంలో వచ్చే ఆనందం వేరని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.కుటుంబ వ్యవస్థను యువత కాపాడుకోవాలి: వెంకయ్య నాయుడు. జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్లతో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని,ప్రకృతి సమతుల్యత కనుమరుగవుతున్న రోజుల్లో. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై. వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలనీ,సేవా దృక్పథంతో కూడిన వైద్యాన్ని అందించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, విద్యుత్ పరికరాల వినియోగం, జంక్ ఫుడ్‌లు తినడం వల్ల సమతుల్యత దెబ్బ తింటుందని. ప్రకృతి అందించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలనీ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నేటి యువతరం కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *