బీజేపీ తెలంగాణ యూనిట్‌లో ఏం జరుగుతోంది?

★ మోదీ భేటీ లీక్ వ్యవహారంపై కిషన్ రెడ్డి ఫైర్.

జనం న్యూస్‌: తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతంది? నాయకుల మధ్య సఖ్యత లేదా?, వర్గపోరు సాగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీతో ఇటీవల తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశం కాగా. ఆ వివరాలు లీక్ చేశారని, అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు మరో రకంగా చెప్పారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్‌లు ఇచ్చిన వారిని గుర్తిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరాలు. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రధానమంత్రి హెచ్చరించినప్పటికీ, కొందరు బాధ్యతారహిత నాయకులు సమావేశ వివరాలను లీక్ చేశారని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తిస్తామని, వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి లీకులు పార్టీకి నష్టం కలిగించడమే కాకుండా. నాయకత్వంలో ఐక్యతను కూడా దెబ్బతీస్తాయని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ మందలించారనే వార్తలను కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమని అన్నారు. ఎంపీలు సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని మాత్రమే ప్రధాని మోదీ సలహా ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారని అన్నారు.ప్రధాని మోదీతో సమావేశంలో జరిగింది ఒకటైతే. బయట పూర్తిగా భిన్నమైన కథనాన్ని ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాదికి చెందిన నాయకులు రెండుసార్లు బీజేపీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీలో మాత్రమే ఒక కార్యకర్త క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదగగలరని అన్నారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై తాను ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే ప్రధాని మోదీతో సమావేశం గురించి లీక్ ఇచ్చింది ఎవరు?, కిషన్ రెడ్డి ఎవరిపై ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు? అనేది బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.