పవన్ కల్యాణ్ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

* అధికారులు నిత్య విద్యార్థులై ఉండాలి.

జనం న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అద్భుతంగా పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పనితీరును ప్రశంసించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. ‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. వెనుకబడిన వర్గాలను ముందుకు తేవటానికే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలి. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలి’అని సీఎం సూచించారు.అభివృద్ధి ఒకవైపు. సంక్షేమం మరోవైపు జరుగుతోంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. ‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నాం. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యం. వ్యవస్థలో ఉండే లోపాలను గుర్తించి వాటిని వినియోగించి పని నుంచి తప్పించుకునే పరిస్థితులు వచ్చాయి. రెవన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్ద నుంచి వేరే వారికి పంపించేస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి.. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం. కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది. ’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.పవన్ కల్యాణ్ పనితీరు అద్భుతం. ‘ రాష్ట్రంలో 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించింది. కానిస్టేబుల్ నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి సమాచారం అందిస్తే తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ‘లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారు. ప్రతీ శాఖ ఆన్ లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి సేవలు అందించాలి. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటిని తిరిగి ప్రవేశపెట్టాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ ద్వారా రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు. ‘విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎస్ఐపీబీల ద్వారా రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. వీటిని క్లియర్ చేయటంలో కలెక్టర్లు కూడా వేగంగా స్పందించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి వచ్చాం. పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉండి గౌరవించాలి. వేగంగా అనుమతులు ఇవ్వాలి. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే. ప్రతిపక్షాలు కూడా దీనిని అర్ధం చేసుకోవాలి. ’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తున్న మోడీ. ‘ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించి ఆలోచన చేయకుండా ముందుకు వెళ్లటం లేదు. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ, పెద్ద ఎత్తున స్థాపించిన కాలేజీల ద్వారా ఐటీ నిపుణులు వచ్చారు. ’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *