సాక్షి డిజిటల్ న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఎక్కడా చెప్పలేదని కనీసం సభ్యత్వం కూడా తీసుకోలేదు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు.తాను బీఆర్ఎస్ సభ్యత్వం కూడా రద్దు చేసుకోలేదని అయితే కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. స్పీకర్ నోటీసులపై బుధవారం లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యతం రద్దుచేసుకోలేదు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను తాను ఎక్కడ కూడా ప్రకటించలేదు అని వివరణ ఇ్చారు.కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. అయితే కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఐదుగురిపై అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం ప్రకటించారు. మొత్తం 10 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు (అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి)లపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ బుధవారం (డిసెంబర్ 17) తన నిర్ణయాన్ని వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ (కాంగ్రెస్)లో చేరినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించింది.