శ్రీ చరణి ప్రతిభకు ప్రభుత్వ గుర్తింపు

★ నగదు, స్థలం, ఉద్యోగం మంజూరు.

జనం న్యూస్: వరల్డ్‌ కప్‌లో సత్తా చాటిన ఆంధ్రా అమ్మాయి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. శ్రీ చరణి ప్రతిభను ప్రోత్సహిస్తూ ఏపీ ప్రభుత్వం తరుఫున రూ.2.50 కోట్ల నగదు ప్రకటించింది. అలాగే కడప నగరంలో 1000 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇంటి స్థలం కేటాయించింది. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 హోదాలో నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుని చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది.ఈ వరల్డ్ కప్ విజయంలో యువ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్‌లో సత్తాచాటిన శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది.ఆమె ప్రతిభను గుర్తిస్తూ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. శ్రీ చరణికి రూ.2.50 కోట్ల నగదు పురస్కారం,కడప నగరంలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అలాగే శ్రీ చరణికి రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ కప్‌లో శ్రీ చరణి అద్భుత ప్రదర్శన నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ ఈ ట్రోఫీని సాధించింది.ఈ విజయం 140 కోట్ల భారతీయుల్లో నూతనోత్సాహం నింపింది. ఈ చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. భారతజట్టులో కడప ప్లేయర్ శ్రీచరణి స్థానం సంపాదించింది. తన తొలి ప్రపంచ కప్‌లోనే అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది.ఈ అద్భుతమైన ప్రదర్శనతో శ్రీ చరణి ఒక్కసారిగా టాప్ బౌలర్లలో స్థానం సంపాదించుకుంది.